Share News

భావితరాలకు ఆస్తి.. పచ్చదనం

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:55 PM

భవిష్యత తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని స్థానిక దేవరకొండ గిరిప్రదిక్షణ మార్గం 3.2 కి.మీలలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేచర్‌ వెల్పేర్‌ కౌన్సిల్‌ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

భావితరాలకు ఆస్తి.. పచ్చదనం
Nagaraju who is planting a sapling, TDP leaders

బుక్కరాయసముద్రం, జూన 5(ఆంధ్రజ్యోతి): భవిష్యత తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని స్థానిక దేవరకొండ గిరిప్రదిక్షణ మార్గం 3.2 కి.మీలలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేచర్‌ వెల్పేర్‌ కౌన్సిల్‌ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడుతో పాటు బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌, ఆర్డీటీ సంస్ధ డైరెక్టర్‌ విశాలా ఫెర్రర్‌, ఏడీసీసీ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, టీడీపీ ప్రధానకార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ఆలం నరసానాయుడు, రామలింగారెడ్డి, సూర్యప్రకా్‌షరెడ్డి పాల్గొని ప్రసగించారు. గంథ్రాలయ మాజీ చైర్మన గౌస్‌మెహద్దీన, లక్ష్మీప్రసాద్‌, రాయల్‌మురళీ, శైలజ, లక్ష్మీనారాయణ, సునీత, కేశన్న, అశోక్‌కుమార్‌, తిప్పలూరి కొండారెడ్డి, శైలకుమారి, డాక్టర్‌ మాలిక్‌, వెంకటేశ్వరరెడ్డి, ఓబులపతి పాల్గొన్నారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సైకిల్‌ తొక్కాలని పూలనాగరాజు పిలుపునిచ్చారు. 23 కి.మీ మేర సైకిల్‌ యాత్రను నాయకులు ప్రారంభించారు.


ఫ్యాక్షన గ్రామాలను పచ్చని పొలాలుగా మార్చాం

- ఎమ్మెల్యే పరిటాల సునీత

కనగానపల్లి: ఫ్యాక్షనతో నలిగి అభివృద్ధికి చోచుకోక అధ్వానంగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి పచ్చని పొలాలుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. తూంచెర్ల గ్రామంలో పలు అభివృద్ది పనుల ప్రారంభాల కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.7.5 కోట్లతో నూతనంగా నిర్మించిన బీటీ, సీసీ రోడ్లు శుక్రవారం ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సైకిల్‌ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంధన పొదుపులో బాగంగా పర్యావరణం కోసం ప్రజలు ఆలోచించాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అవి చూసిన వైసీపీ నాయకులు వెన్నుపోటు అంటూ కార్యక్రమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పీఆర్‌ డీఈలు లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, కన్వీనర్‌ యాతం పోతులయ్య, డీసీఎంఎస్‌ చైర్మన నెట్టెం వెంకటేష్‌, మార్కెట్‌ యార్డు చైర్మన బోయపాటి సుధాకర్‌, ముకుందనాయుడు, బంగి మల్లేష్‌, యాతం చెన్నప్ప, ఆదెప్ప, బోర్ల చెన్నప్ప, జయశంకర, మల్లికార్జున, పతకమూరి అంజి, స్వాతి, పూజారి రాజాకృష్ణ పాల్గొన్నారు.

మొక్కే ప్రాణాధారం: ఎమ్మెల్యే, కమిషనర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌: భవిష్యత్తు తరాలకు మొక్కే ప్రాణాధారమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక హెచ్చెల్సీ కాలనీలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏఎంసీ కమిషనర్‌ జస్వంతరావుతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి ప్రారంభించారు. నగరపాలక సంస్థ హార్టికల్చర్‌ ఏడీ లక్ష్మయ్య, ఇనచార్జి ఎంహెచవో సునీత, టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి వన్నూరప్ప, బోయ పవనకుమార్‌, శ్రీనివాసులు, కడ్డీల శీనా, నరేంద్రచౌదరి, సింగవరం రవి, నెట్టెం బాలకృష్ణ, రామసుబ్బయ్య, పద్మావతి, ఈశ్వరమ్మ, ఫరీదాబేగం, శ్రీవాణి, రాజేష్‌, హర్ష, గుంతకల్లు వెంకటేష్‌, హుస్సేనపీరా పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:55 PM