Share News

JC: సమస్యలను వెంటనే పరిష్కరించాలి : జేసీ

ABN , Publish Date - May 21 , 2026 | 11:52 PM

ప్రజలు, రైతుల నుంచి వచ్చిన అర్జీలపైన తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించాలని జేసీ విష్ణుచరణ్‌ స్థానిక అధికారులను ఆదేశించారు. వజ్రకరూరు మండ లంలోని రాగులపాడు గ్రామంలో గురువారం ‘ఒక నెల - ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ అనే కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు.

JC: సమస్యలను వెంటనే పరిష్కరించాలి : జేసీ
JC Vishnucharan talking to farmers

వజ్రకరూరు(ఉరవకొండ), మే 21(ఆంధ్రజ్యోతి): ప్రజలు, రైతుల నుంచి వచ్చిన అర్జీలపైన తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించాలని జేసీ విష్ణుచరణ్‌ స్థానిక అధికారులను ఆదేశించారు. వజ్రకరూరు మండ లంలోని రాగులపాడు గ్రామంలో గురువారం ‘ఒక నెల - ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ అనే కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ప్రజలు, రైతుల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలు సుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 60ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూము లకు పట్టాలు ఇవ్వలేదని టీడీపీ నాయకుడు ధనుంజయ జేసీ దృష్టికి తీసుకెళ్లారు. రీసర్వే వల్ల తప్పులు దొర్లాయని, సరిదిద్దాలని కోరారు. అనంతరం జేసీ ఉరవకొండ తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాల యంలోని రికార్డులను పరిశీలించారు. డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రికార్డు డేటా ఎంట్రీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దారు భోగన గౌడ్‌, నరేష్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 21 , 2026 | 11:52 PM