Share News

WATER: తాగునీటికి తిప్పలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:00 AM

మండ లంలోని ఆవులదట్ల గ్రామంలో గ్రామపంచాయతీ బోర్లు మెండుగా ఉన్నా ఎస్సీకాలనీకి నీరు సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమై నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీ వాసులు చాలాకాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

WATER: తాగునీటికి తిప్పలు
A scene of waiting at a single tap in a colony

- ఆవులదట్ల ఎస్సీకాలనీలో సమస్య

- 120 కుటుంబాలకు ఒకటే కొళాయి

- దిష్టిబొమ్మల్లా మినీ ట్యాంకులు

రాయదుర్గం రూరల్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్ర జ్యోతి): మండ లంలోని ఆవులదట్ల గ్రామంలో గ్రామపంచాయతీ బోర్లు మెండుగా ఉన్నా ఎస్సీకాలనీకి నీరు సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమై నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీ వాసులు చాలాకాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినిత్యం కాలనీలో ఉన్న ఒకే ఒక్క కొళాయి వద్ద వేచి ఉండి, తాగు నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడిందని వారంటున్నారు. కొందరు ఊ రి చివర వద్ద నున్న కొళాయి నుంచి నీటిని తెచ్చుకుం టున్నారు. తాగు నీటి సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా ఫలితం లేదన్నారు. గ్రామంలో కరెంటు రాత్రి వేళ వస్తే అప్పుడే బిందెలు తీసు కెళ్లి కొళాయి వద్ద నుంచి నీరు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఓవర్‌హెడ్‌ట్యాంక్‌ నుంచి ఎస్సీకాలనీలోని మినీట్యాంకులకు నీరు సరఫరా చేసేవారు. తాగునీరు సరఫరా అయ్యే మెయిన పైపు బంద్‌ కావడంతో కాలనీలోని రెండు మినీట్యాంకులకు నీరు సరఫరా కావడం లేదంటున్నారు. దీంతో అవి నిరపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మినీ ట్యాంకులకు నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుని, కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 19 , 2026 | 12:00 AM