Share News

MLA: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:43 PM

ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యఽ దిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

MLA: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

-ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం రూరల్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యఽ దిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేద న్నారు. పారదర్శకతతో కూడిన సత్వర పరిష్కారాలను అందిస్తున్నామ న్నారు. పీజీఆర్‌ఎస్‌ ద్వారా అధికారుల్లో బాధ్యతను పెంచామన్నారు. భ విష్యత్తులో సమస్యల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేస్తా మన్నారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్లను మంజూరు చేయనుం దని వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి క్రిష్ణమూర్తి, మండల కన్వీనర్‌ కురుబ హనుమంతు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన డైరెక్టర్‌ పొరాళ్ల పురుషోత్తం, కొండాపురం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2026 | 11:43 PM