MLA: మహిళల ఆర్థికాభివృద్ధితో పేదరిక నిర్మూలన
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:52 PM
మహిళల ఆర్థిక స్వాలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. వెలుగు (సెర్ప్) ఆధ్వర్యంలో పట్టణంలోని డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలుగు మహిళలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే కుట్టుశిక్షణ పూర్తి చేసు కున్న మహి ళలకు సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.
- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గంరూరల్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక స్వాలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. వెలుగు (సెర్ప్) ఆధ్వర్యంలో పట్టణంలోని డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలుగు మహిళలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే కుట్టుశిక్షణ పూర్తి చేసు కున్న మహి ళలకు సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ... మహిళా సంఘాల సభ్యులు స్వయం సమృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. మహిళల అభివృద్ధి లేకుండా సమాజాభివృద్ధి అసా ధ్యమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళా సంఘాలు మూలస్తం భాలుగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వ సహకారం, బ్యాంకుల ప్రోత్సా హంతో స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు.
పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. బ్యాంకు లింకేజీల ద్వారా మహిళలు వ్యాపార రంగంలో ముందుకొస్తున్నారని ప్రభుత్వం అందిస్తున్న రుణా లు వారికి ఆర్థిక బలం ఇస్తున్నాయని తెలిపారు. 2025-26లో ప్ర భు త్వం దాదాపు రూ. 219 కోట్ల రుణాలు మంజూరు చేసిందన్నారు. డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆదుకునేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందన్నా రు. మహిళా సంఘాల సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన హనుమంతరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, డి. హీరేహాళ్ మండల కన్వీనర్ కాదలూరు మోహనరెడ్డి, నాగళ్లి రాజు, ఏసీ గోవిందప్ప, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....