JCPR: జేసీపీఆర్‌తో పోలీసు అధికారుల భేటీ
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:50 PM
నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచ కాలు, దౌర్జన్యాలు తగ్గలేదని, దీనిపై అనంతపురంలో సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వెళ్లి ఎస్పీకి వివరించేం దుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు.
తాడిపత్రి, జూన 15(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచ కాలు, దౌర్జన్యాలు తగ్గలేదని, దీనిపై అనంతపురంలో సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వెళ్లి ఎస్పీకి వివరించేం దుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం సీఐలు ఆరోహణ రావు, శివగంగా ధర్‌రెడ్డి, ఎస్‌ఐలు దయాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సోమవా రం ఉదయం మాజీ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. అప్పటికే ప్రభుత్వ పెద్దలు, ఎస్పీ ఆయనతో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తన వద్దకు వచ్చిన పోలీసు అధికారులకు ఆయన గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలపై వారికి బుక్ లెట్ రూపంలో అందించి, వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినా వారి దౌర్జన్యాలు ఆగడాలు ఆగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు నచ్చజెప్పి స్పందన కార్యక్రమానికి వెళ్లకుండా వాయిదా వేయించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....