MEETING: తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:52 PM
స్థానిక ఎంపీడీఓ కార్యా లయం సమావేశ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎంపీపీ గిరక రమాదేవి అధ్యక్షతన ‘మన పల్లె- మన నీరు’ అనే కార్యక్రమంపై నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు తమ శాఖల ద్వారా జరిగే పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లు వివరించారు.
ధర్మవరం రూరల్, జనవరి21(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యా లయం సమావేశ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎంపీపీ గిరక రమాదేవి అధ్యక్షతన ‘మన పల్లె- మన నీరు’ అనే కార్యక్రమంపై నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు తమ శాఖల ద్వారా జరిగే పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లు వివరించారు. అయితే ప్రజల సమస్యలపై చర్చించకుండా కేవలం అధికారుల ప్రసంగాలతో ముగించేశారు. ఉప్పునేసినపల్లి సర్పంచ ముత్యాలప్పనాయుడు మాత్రం తమ గ్రామంలో శ్మశానవాటిక స్థల సమస్యపై మాట్లాడారు. అలాగే గ్రామపరిధిలో భూములు అన్యాక్రాంతం అయ్యాయని సమావేశంలో రెవెన్యూ అధికారులను నిలదీశారు. మిగతా ప్రజాప్రతినిధులు ఎవరూ ప్రజల సమస్యలపై నోరుమెదపలేదు. అనంతరం ఎంపీడీఓ సాయిమనోహర్ మాటా ్లడుతూ అందరి సహ కారంతో ప్రజలకు మరింత సేవలు అందిద్దామని, గ్రామాల అభివృద్ధికి కోసం కృషిచేద్దామని పేర్కొన్నా రు. ఈ సమావేశంలో ఎవరూ ప్రజల సమస్యలపై చర్చించక పోవ డంతో గంటలోపే సమా వేశాన్ని ముగించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, అలా వచ్చామా... ఇలా వెళ్లమా అన్న ట్లుగా సమావేశం ముగిసిందని పలువురు విమర్శిస్తున్నారు. ఇదేమి సమావేశం? ప్రజల సమస్యలు పట్టించుకోరా అం టూ కార్యాలయానికి వచ్చిన ప్రజలు చర్చించుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....