Share News

CROP: బెట్టను తట్టుకునే పంటలు వేయండి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:22 PM

ఈ యేడు ఎల్‌ని నో ప్రభావం ఉన్నందున రైతులు ఈ ఖరీఫ్‌లో వర్షాభావాన్ని తట్టుకునే పంటలనే సాగు చేయాలని ఏఓ హెచ పెన్నయ్య తెలిపారు. విడపనకల్లు లో సోమవారం రైతన్నా మీకోసం వారోత్సవాలను ఆయన రైతులతో క లిసి ప్రారంభించారు.

CROP: బెట్టను తట్టుకునే పంటలు వేయండి
Officials launching the 'Raitanna Meekosam' (Farmers, For You) program in Vidapanakallu.

- వ్యవసాయాధికారులు

విడపనకల్లు/యాడికి, జూన 22(ఆంధ్రజ్యోతి): ఈ యేడు ఎల్‌ని నో ప్రభావం ఉన్నందున రైతులు ఈ ఖరీఫ్‌లో వర్షాభావాన్ని తట్టుకునే పంటలనే సాగు చేయాలని ఏఓ హెచ పెన్నయ్య తెలిపారు. విడపనకల్లు లో సోమవారం రైతన్నా మీకోసం వారోత్సవాలను ఆయన రైతులతో క లిసి ప్రారంభించారు. అలాగే ఏఓ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో యా డికిలో రైతన్నా మీకోసం వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమంలో మండల వ్యా ప్తంగా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి అన్న దాత సుఖీ భవ డబ్బు ఖాతాల్లో జ మైందా? లేదా అని అడిగి తెలుసుకుంటామని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. వర్షాభావాన్ని తట్టుకునే కంది, మొక్కజొన్న, ఆము దం, పెసర, వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎరువులను ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎమ్మార్పీ ధరలకే రైతులకు విక్రయిస్తామని వారు రైతులకు తెలిపారు. .


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 22 , 2026 | 11:22 PM