PGRS: పీజీఆర్‌ఎస్ వెలవెల
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:01 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీ ఆర్‌ఎస్) కార్యక్రమం తాడిపత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబో యింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్య క్రమానికి కేవలం నాలుగుశాఖల అధికారులు హాజరయ్యారు.
- పలుశాఖల అధికారుల డుమ్మా
తాడిపత్రి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీ ఆర్‌ఎస్) కార్యక్రమం తాడిపత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబో యింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్య క్రమానికి కేవలం నాలుగుశాఖల అధికారులు హాజరయ్యారు. ఉద యం 11.30 గంటలకు తహసీల్దార్ సోమశేఖర్‌తో పాటు ఐసీడీఎస్, వ్యవసాయ, గృహ నిర్మాణశాఖలకు చెందిన అధికారులు మాత్రమే కనిపించారు. మిగతాశాఖల అధికారులు గైర్హాజరయ్యారు. సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు తమ వినతులు సమర్పించకుండానే నిరాశతో వెనుదిరిగారు. కొందరు తమ అర్జీలను తహసీల్దార్‌కు అందజేసి వెళ్లాల్సి వచ్చింది. ప్రజా సమస్యలకు తక్షణం పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నప్పటికి, స్థానిక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు లేకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పాలి అని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....