LEFTISTS: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:11 AM
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించా ల్సిందేనని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరస నలో భాగంగా వారు రాస్తారోకో నిర్వహించారు. గుంతకల్లు పట్ట ణంలోని హనుమాన సర్కిల్‌లో మంగళవారం రాస్తారోకో నిర్వహించా రు.
- వామపక్ష నాయకుల డిమాండ్ - రాస్తారోకో
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్)
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించా ల్సిందేనని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరస నలో భాగంగా వారు రాస్తారోకో నిర్వహించారు. గుంతకల్లు పట్ట ణంలోని హనుమాన సర్కిల్‌లో మంగళవారం రాస్తారోకో నిర్వహించా రు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెల వ్యవధిలో వరుస గా నాలుగు సార్లు ధరలను పెంచి సమాన్య ప్రజలపై పెనుభారం మో పడం దుర్మార్గం అన్నారు. దీంతోమ నిత్యవసర సరుకులు, రవా ణా చా ర్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కా ర్యవర్గ సభ్యులు వీరభద్రస్వామి, పట్టణ కార్యదర్శి ఎస్‌ఎండీ గౌస్, ఏఐ టీయూసీ జిల్లా అధ్యక్షుడు బీ మహేష్, సీపీఎం నాయకులు మారుతి ప్రసాద్, సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ డివిజన కార్యదర్శి బి సురేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఫీరోజ్‌ఖాన తదితరులు పాల్గొన్నారు.
అలా గే మండలంలోని తిమ్మాపురం సమీపంలోని హైవేపై సీపీఐ మండల కార్యదర్శి రాము ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఫ అదేవిధంగా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్‌లో ఖాళీ సిలిం డర్లు, కట్టెలతో నిరసన తెలిపారు. సీపీఐ మండల కార్యదర్శి రామదాసు, సీపీఎం మండల కార్యదర్శి నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఉరవ కొండలో అనంతపురం- గుంతకల్లు రహదారిలోని టవర్ క్లాక్ కూడలిలో బైఠాయించి, రాస్తారొకో నిర్వహించారు. వామపక్ష నాయకులు కేశవరె డ్డి, చెన్నరాయుడు, కృష్ణమూరి తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గంలో ని వినాయక కూడలిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున, సీ పీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగార్జున ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. కళ్యాణదుర్గంలో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో సీపీఐ నియోజకవర్గ కార్య దర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. యాడికిలోని గాంధీ విగ్రహం వద్ద రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడుయాదవ్, నియోజకవ ర్గ కార్యదర్శి ఓబులరెడ్డి, సీపీఐ నాయకులు శివన్న, నీలూరు లక్ష్మయ్య, మల్లారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.