Share News

GAS: గ్యాస్‌ కోసం బారులు తీరిన జనం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:18 PM

పట్టణంలో భారత గ్యాస్‌ ఏజేన్సీ వారు వారం రోజులుగా గ్యాస్‌ సిలిండర్లు ఇంటింటికి పం పిణీ చేయలేదు. అయితే బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో పంపిణీ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అక్కడికి పె ద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి ఖాళీ సిలిండర్లను క్యూలైనలో ఉంచి వేచి ఉన్నారు.

GAS: గ్యాస్‌ కోసం బారులు తీరిన జనం
Bars lined up for gas cylinders in Yadiki

తాడిపత్రి/యాడికి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పట్టణంలో భారత గ్యాస్‌ ఏజేన్సీ వారు వారం రోజులుగా గ్యాస్‌ సిలిండర్లు ఇంటింటికి పం పిణీ చేయలేదు. అయితే బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో పంపిణీ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అక్కడికి పె ద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి ఖాళీ సిలిండర్లను క్యూలైనలో ఉంచి వేచి ఉన్నారు. మధ్యాహ్నం లోడ్‌ రావడంతో కొందరికి పంపిణీ చేశారు. మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జిల్లా పౌరస రఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ సోమశేఖర్‌, సివిల్‌సప్లై అధికారి మల్లేష్‌ లబ్ధిదారులతో మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్‌ వచ్చేటట్లు చేస్తామని హామీఇచ్చారు. అలాగే యాడికిలోనూ గ్యాస్‌ సిలిండర్ల కోసం గ్యాస్‌ ఏజేన్సీ వద్దకు సోమవారం వినియోగదారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఉదయం 5గంటల నుంచే ఖాళీ సిలిండర్లను క్యూలైనలో ఉంచి వేచి ఉన్నారు. మధ్యాహ్నం 1గంటల సమయానికి 360గ్యాస్‌ సిలిండర్ల లోడ్‌ రావడంతో వాటిని పం పిణీ చేశారు. మిగిలిన వినియోగదారులతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సీఎస్‌డీటీ మల్లేష్‌, డిప్యూటి తహసీల్దార్‌ శ్రీనివాసులు, యాడికి సీఐ శ్రీనివాసులు మాట్లాడారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే సిలిండర్లను సీనియారిటీ బుకింగ్‌ ప్రకారం పంపిణీ చేస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 18 , 2026 | 11:18 PM