PETROL: పెట్రోల్ కోసం జనం బారులు
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:54 PM
పట్టణంలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా ఆరింటిలో నో స్టాక్ బోర్డులు పెట్టేశా రు. దీంతో పెట్రోలు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారు. పట్టణంలోని కోర్టు పక్కన ఉన్న పెట్రోల్ బంకులో మాత్రమే సోమవారం పెట్రోల్, డీజిల్ వేస్తుండగా వాహనదారులు బారులు తీ రారు.
కళ్యాణదుర్గం రూరల్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా ఆరింటిలో నో స్టాక్ బోర్డులు పెట్టేశా రు. దీంతో పెట్రోలు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారు. పట్టణంలోని కోర్టు పక్కన ఉన్న పెట్రోల్ బంకులో మాత్రమే సోమవారం పెట్రోల్, డీజిల్ వేస్తుండగా వాహనదారులు బారులు తీ రారు. వివిధ గ్రామాల నుంచి వ్యక్తి గత పనుల కోసం పట్టణానికి వ స్తూ మధ్యలోనే పెట్రోల్ ఖాళీ అవడంతో వాహనాలతో వచ్చిన వారు కొందరైతే, వాటర్ బాటిళ్లు తీసుకుని పెట్రోల్ కోసం మరికొం తమంది వచ్చారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు జోక్యం చేసుకుని క్యూ లైన ఏర్పాటు చేశారు. దగ్గరుండి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
పెట్రోల్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి: ఆర్డీవో
పెట్రోల్, డీజిల్‌ను ప్రజలకు అందుబాటు లో ఉంచాలని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆర్డీవో వసంతబాబు సూచించారు. పట్టణంలోని పెట్రోల్ బంకులను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళ్యాణదుర్గం డివిజన వ్యాప్తంగా అవసరా లకు తగిన ఇంధనం ఉందని, ప్రజలు అపోహాల నమ్మకుండా అవసరం మేరకు ఉపయోగించుకోవచ్చని అన్నారు. రెవెన్యూ డివిజన పరిధిలోని మొత్తం 46 పెట్రోల్ బంకులు ఉన్నాయన్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద వీఆర్వోలను నియమించి 24 గంటలు పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారుల్లో పూర్తి స్థాయిలో అపోహాలు తొలగించాల్సిన బాధ్యత పెట్రోల్ బంకుల నిర్వాహకులపై ఉందన్నారు. రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్లు ఆర్డీవో వెంట ఉన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....