Share News

MLA : పేదలకు పింఛన ఆర్థిక భరోసా

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:04 AM

సామాజిక పింఛన పే దలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పే ర్కొన్నారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటి వద్దకే పిం ఛన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటో తేదీన ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదే అన్నారు.

MLA : పేదలకు పింఛన ఆర్థిక భరోసా

-ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, జూలై 1(ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన పే దలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పే ర్కొన్నారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటి వద్దకే పిం ఛన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటో తేదీన ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 25 నె లల కాలంలో ఎక్కడా ఒక్క విమర్శ కూడా లేకుండా లక్షల మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన పంపిణీ జరుగుతోందన్నారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో రూ. 13 కోట్ల విలువైన అభివృద్ధి పనులను పట్టణంలో చేపట్టా మన్నారు. ఆయన బుధవారం పట్టణంలోని తొమ్మిదో వార్డులో సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. మరో నెల రోజుల్లో రూ. 25 కోట్ల విలువైన పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 02 , 2026 | 12:04 AM