Share News

GOD: వైభవంగా పెద్దమ్మ, మారెమ్మ జాతర

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:50 PM

మండల పరిధిలోని కమ్మూరులో శుక్రవారం పెద్దమ్మ, మారెమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఇం టింటి నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమ ర్పించారు.

GOD: వైభవంగా పెద్దమ్మ, మారెమ్మ జాతర
Peddamma and Maremma deities in decoration

కూడేరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కమ్మూరులో శుక్రవారం పెద్దమ్మ, మారెమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఇం టింటి నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమ ర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా పేరు గాంచిన పెద్దమ్మ,. మారెమ్మకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గత రెండ్రోజులుగా జాతర సందర్భంగా అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతుల ఇంట సిరులు పంట పండాలని భక్తులు వేడుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2026 | 11:50 PM