MLA: ప్రభుత్వ బడుల్లోనే భవిష్యత్తుకు బాటలు
ABN , Publish Date - May 13 , 2026 | 11:34 PM
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకా శం వుంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంపై బుధవారం పట్టణంలో ని ఏడో వార్డులో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
- ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గం రూరల్, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకా శం వుంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంపై బుధవారం పట్టణంలో ని ఏడో వార్డులో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. డీఈవో ప్రసాదబాబు, పీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ బడులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని మెరుగైన విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. కావున తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఎస్‌ఆర్‌సీ ఫౌండేషన ఆధ్వర్యంలో వచ్చే మూడు నెలల్లోగా ఉచితంగా సైకిళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి
ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ వ్యాపారవేత్తగా ఎదిగి కుటుంబానికి ఆర్థి స్థిరత్వం సాధించే దిశగా కష్టపడాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.
పట్టణంలోని ప్ర జావేదిక వద్ద బుధవారం సెర్ప్ పీడీ శైలజ ఆధ్వర్యంలో గ్రా మైక్య సంఘాల యానిమేటర్లకు, సభ్యులకు ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు చేతుల మీదుగా స్మార్ట్‌ఫోన్లను అందజే శారు. అంతకుముందు సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహి ళలతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని మహిళా సంఘా సభ్యులు 209 మందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయ కులు, కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
కళ్యాణదుర్గం: కంబదూరు మండల పరిధిలోని గుద్దెళ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవిష్కరించారు. ఆయన బుధవారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఎస్‌ఆర్‌సీ ట్రస్టు నిధులతో టీడీపీ నా య కులు ఏర్పాటు చేసిన ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించా రు. అలాగే గ్రామంలో యల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ. లక్ష సొంత నిధులను ఎమ్మెల్యే యాదవ కులస్థులకు అంద జేశారు. అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....