JCPR: అడ్డంకులను అధిగమించి ఆలయ స్థలాలను కాపాడుతా
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:41 PM
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ భూములు, స్థలాలు స్వామివారికి చెందేలా చేస్తానని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆలయ స్థలాలు, భూముల అన్యాక్రాంతంపై చర్చించడానికి బుధవారం యాడికిలో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆలయ స్థలాల ఆక్రమణదారులు రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
యాడికి, మార్చి25(ఆంధ్రజ్యోతి): ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ భూములు, స్థలాలు స్వామివారికి చెందేలా చేస్తానని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆలయ స్థలాలు, భూముల అన్యాక్రాంతంపై చర్చించడానికి బుధవారం యాడికిలో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆలయ స్థలాల ఆక్రమణదారులు రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆక్రమణదారులందరికి కచ్చితమైన సమాచారం ఇచ్చి మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. సమావేశానికి రాకపోతే చట్టప్రకారం కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. 1200ఎకరాలు ఆలయ భూములున్న స్వామివారి ఉత్సవాలు నిర్వహణకు దాతల వద్ద చేయి చాపాల్సి రావడం చా లా బాధాకరమన్నారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చే స్తానని తెలిపారు. నెలకు రూ.2లక్షలకు పైగా ఆదాయం వచ్చే షాపింగ్ కాంప్లెక్స్‌ను వినియోగంలోకి రాకుండా అడ్డుకోవడం బాధాకరమని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా యాడికిలో అభివృద్ధి పనులు చేసి తీరుతానని తెలిపారు. యాడికి గ్రామపంచాయతీ కార్యాలయం ప్రస్తుత భవనాన్ని కూల్చివేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. యాడికిలోని కుంటను చెన్నకేశవస్వామి వారి పుష్కరిణిగా మా రుస్తానని తెలిపారు. తనకు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, వారి అండ ఉన్నంతవరకు తనని ఎవరు ఏమి చేయలేరని తెలిపారు. తనకు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ముఖ్యమని ఆయన తెలిపారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకుడు హరికృష్ణశర్మ, తహశీల్దార్ ప్రతా్‌పరెడ్డి, ఆలయ ఈఓ దుర్గాప్రసాద్, పంచాయతీ ఈఓ అరుణ్‌కుమార్, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....