Share News

MLA: మన విద్యాప్రమాణం దేశానికే ఆదర్శం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:26 PM

విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, రుచి, శుచిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్‌బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యాప్రమాణం ఓ మార్గదర్శకంగా కొనసాగుతుండటం అభినందనీయమన్నారు.

MLA: మన విద్యాప్రమాణం దేశానికే ఆదర్శం
MLA Kalava having lunch with students

-ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గంరూరల్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, రుచి, శుచిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్‌బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యాప్రమాణం ఓ మార్గదర్శకంగా కొనసాగుతుండటం అభినందనీయమన్నారు. రాయదుర్గం పట్టణ శివారులోని 21వ వార్డు పైతోటలో ఉన్న భక్తకన్నప్ప మున్సిపల్‌ ప్రైమరీ పాఠశాల విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకంపై బుధవారం ముఖాముఖి సంభాషించారు.


భోజనం రుచిగా, నాణ్యంగా ఉందని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, పైతోట రామాంజి, శీన, మధు, ఆంజనేయులు, సిద్ధన్న తదితరులు పాల్గొన్నారు.

రైతుకు అండగా కూటమి ప్రభుత్వం

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ మూడువిడతల్లో రూ. 20 వేల నగదు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ అయిన నేపథ్యంలో డి హీరేహాళ్‌ మండలం లోని దొడఘట్ట గ్రామంలో బుధవారం నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన గ్రామంలో ఇంటింటా తిరిగి రైతులకు నగదు జమ అయిందా లేదా అంటూ కరపత్రాలను అందిస్తూ ఆరాతీశారు. ప్రస్తుతం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో రైతులకు మరింత సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన డైరెక్టర్‌ నాగళ్లి రాజు, టీడీపీ మండల కన్వీనర్‌ మోహనరెడ్డి, క్లస్టర్‌ కన్వీనర్‌ గంగాధర, ఎంపీటీసీ మొండి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 18 , 2026 | 11:26 PM