Share News

VEHICHLE: మా బండి.. మా ఇష్టం !

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:39 PM

మా బండి. మా ఇష్టం అనే రీతిలో మండలంలో కొందరు ద్విచక్రవాహనదారులు వ్యవహరిస్తున్నారు. రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు నంబర్‌ ప్లేట్లు అమర్చుకుంటున్నారు. ప్లేట్‌ ఉంటుంది కానీ కొన్నింటిపై నంబర్‌ ఉండదు.

VEHICHLE: మా బండి.. మా ఇష్టం !
Vehicle without plate and number

- బైకులకు ఇష్టారాజ్యంగా

నంబర్‌ ప్లేట్ల ఏర్పాటు

- కొన్ని వాహనాలకు కానరాని ప్లేట్లు

- రవాణాశాఖ నిబంధనలు బేఖాతరు

యాడికి, ఏప్రిల్‌23(ఆంధ్రజ్యోతి): మా బండి. మా ఇష్టం అనే రీతిలో మండలంలో కొందరు ద్విచక్రవాహనదారులు వ్యవహరిస్తున్నారు. రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు నంబర్‌ ప్లేట్లు అమర్చుకుంటున్నారు. ప్లేట్‌ ఉంటుంది కానీ కొన్నింటిపై నంబర్‌ ఉండదు. ఒకవేళ ఉన్నా కనీ కనిపించకుండా ఉంటుం ది. కొన్ని నంబర్‌ప్లేట్లపై ఫలానావారి తాలూకా అని రాయించుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాల్లో ఇలాంటి వాహనాలు పట్టుబడినప్పుడు ఆయా ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరం అవుతోంది. తనిఖీల్లో పట్టుబడినప్పుడు ప్రజాప్రతినిధి పేరుతో నంబర్‌ప్లేట్‌ ఉన్న ద్విచక్రవాహనాలను పోలీ్‌సస్టేషనకు తరలించాలా ? వద్దా ? అని పోలీసులు సంశయిస్తున్నారు.

నిబంధనలు గాలికి..

ద్విచక్రవాహనాలకు ముందువైపు, వెనుకవైపు నంబర్‌తో కూడిన ప్లేట్‌ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలనే రవాణాశాఖ నిబంధనలను వాహనదారులు గాలికి వదిలేశారు. ప్లేట్‌పై నంబర్లు కూడా నిర్ధిష్ట పరిమాణంలో ఉండాలనే నిబంధన ఉంది.


కానీ వాహనదారులు వారి ఇష్టానుసారంగా ఒకటి, రెండు నంబర్లను మాత్రమే పెద్ద సైజులో రాయించుకుంటున్నారు. మిగిలినవాటిని చాలా చిన్న సైజులో ఉండేలా నంబర్‌ప్లేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన కొద్దిమంది ఉద్యోగులు సైతం ఈ నిబంధనలను తుంగలో తొక్కడం గమనార్హం.

ప్రమాదాలు జరిగితే గుర్తించడం కష్టమే

నంబర్‌ప్లేట్లు లేని వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు ఎవరనేది గుర్తించడం కష్టం. అటు వంటి వాహనాలను వాడి నేరాలకు పాల్పడితే నిందితులను గుర్తించడం, పట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాహనాలపై రవాణా, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

దృష్టి సారిస్తాం -శ్రీనివాసులు, ఎంవీఐ, తాడిపత్రి

రవాణాశాఖ నిబంధనల ప్రకారం వాహనాలకు తప్పనిసరిగా ప్లేట్లు, నంబర్‌ ఉండాలి. నంబర్‌ప్లేట్లు లేని వాహనాలపై తిరగడం నేరం. నంబర్లను ఇష్టానుసారంగా రాయించకూడదు. నంబర్‌ప్లేట్లు లేని వాహనాలపై గతంలో ప్రత్యేక డ్రైవ్‌ చేసి కేసులు నమోదు చేశాం. నంబర్‌ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2026 | 11:39 PM