Share News

HOUSING: హౌసింగ్‌ కార్యాలయంలో ఆపరేటర్లు మాత్రమే

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:14 PM

స్థానిక హౌసింగ్‌ డీఈఈ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం కంప్యూటర్‌ ఆపరేటర్లే విధులు నిర్వహించారు. డీఈఈ, ఏఈల కోసం పలువురు లబ్ధిదారులు, మాజీ కౌన్సిలర్లు కార్యాల యానికి వచ్చి వెళ్లారు. వారికి కంప్యూటర్‌ ఆపరేటర్లే సమాధా నమిచ్చి పంపారు.

HOUSING: హౌసింగ్‌ కార్యాలయంలో ఆపరేటర్లు మాత్రమే
Computer operators working in the office

గుంతకల్లు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక హౌసింగ్‌ డీఈఈ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం కంప్యూటర్‌ ఆపరేటర్లే విధులు నిర్వహించారు. డీఈఈ, ఏఈల కోసం పలువురు లబ్ధిదారులు, మాజీ కౌన్సిలర్లు కార్యాల యానికి వచ్చి వెళ్లారు. వారికి కంప్యూటర్‌ ఆపరేటర్లే సమాధా నమిచ్చి పంపారు. డీఈఈ, ఏఈల గురించి అడగ్గా అధికారులు ఆర్డీవో పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి అటునుంచి అటే ఫీల్డుకు వెళ్లారని ఆపరేటర్లు సమాధానమిచ్చారు. కాగా గత కొన్ని నెలల నుంచి ఇక్కడ హౌసింగ్‌ డీఈఈ విధులు నిర్వహిస్తున్నా సక్రమంగా అందుబాటులో ఉండటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కిందటి నెల వరకు పనిచేసి వెళ్లిన షాషావలి తాడిపత్రి రెగ్యులర్‌ డీఈఈ గా ఉంటూ గుంతకల్లు ఎఫ్‌ఏసీగా రావడంతో ఇక్కడ సక్రమంగా హాజరు ఉండేదికాదు. వారంలో గరిష్టంగా రెండు రోజులకు మించి లేరు. కొన్ని రోజుల కిందట ఆయన ఇన్చార్జ్‌ బాధ్యతల నుంచి వైదొలగి తాడిపత్రికి వెళ్లడంతో ఆయన స్థానంలో హనుమప్ప డీఈఈగా ఇక్కడకు వచ్చారు. ఆయన కూడా ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత వచ్చే డీఈఈ అయినా సక్రమంగా ఉంటే చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 22 , 2026 | 11:14 PM