Share News

PROTEST: ఆనలైనలో అమ్మకాలు నిలిపివేయాలి

ABN , Publish Date - May 21 , 2026 | 12:04 AM

ఆనలైనలో మందులు అమ్మకాలు ని లిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత కెమిసి్ట్రస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం మెడికల్‌ షాపుల నిర్వాహకులు దుకాణా లను బంద్‌ చేసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తి గాంధీ సర్కిల్‌లో నిరసన తెలిపారు.

PROTEST: ఆనలైనలో అమ్మకాలు నిలిపివేయాలి
Protest at Gutti Gandhi Circle

- మందుల దుకాణాల యజమానులు

(ఆంధ్రజ్యోతి, నెట్‌ వర్క్‌)

ఆనలైనలో మందులు అమ్మకాలు ని లిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత కెమిసి్ట్రస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం మెడికల్‌ షాపుల నిర్వాహకులు దుకాణా లను బంద్‌ చేసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తి గాంధీ సర్కిల్‌లో నిరసన తెలిపారు. అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించి, రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆ సంఘం అధ్యక్షుడు విశ్వనాథం, నాయకులు సురేష్‌, గురుప్రసాద్‌, శ్రీనివాసులు, సత్యనారాయణ, సాయి, మురళి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గుంతకల్లులో నిర్వహించిన మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతం అయింది. కార్పొరేట్‌ సంస్థలు ఆనలైన మెడికల్‌ సెల్‌ నిర్వహించ రాదన్నారు. భారీ డిస్కాంట్‌ ఆఫర్లు, డాక్టర్‌ ప్రిస్కిప్షన లేకుండా ఆల్‌లైన అమ్మకాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఆనలైనలో మందుల విక్రయాలకు నిరసనగా బెళుగుప్ప, యాడికిలోనూ మందుల దుకా ణాలు యజమానలు దుకాణాలను బంద్‌ చేసి, నిరసన తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 21 , 2026 | 12:05 AM