Share News

MLA: పేదల సంక్షేమానికి అహర్నిశలు ఎన్టీఆర్‌ కృషి

ABN , Publish Date - May 29 , 2026 | 12:16 AM

పేదల సంక్షేమానికి ఎన్టీ ఆర్‌ అహర్నిశలు కృషి చేసి, వారిగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొనియా డారు. పట్టణంలోని సిరి కన్వెన్షన హాల్లో గురువారం మహానాడు రెండో రోజు ఎన్టీఆర్‌ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

MLA: పేదల సంక్షేమానికి అహర్నిశలు ఎన్టీఆర్‌ కృషి
MLA Amilineni who is called Johar NTR in Kalyanadurgam

- ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, మే 28(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమానికి ఎన్టీ ఆర్‌ అహర్నిశలు కృషి చేసి, వారిగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొనియా డారు. పట్టణంలోని సిరి కన్వెన్షన హాల్లో గురువారం మహానాడు రెండో రోజు ఎన్టీఆర్‌ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. అలాగే ఆయన శెట్టూరు మండలం అయ్యగార్లప ల్లి, కుందుర్పి మండలంలోని జంబగుంపల, కుందుర్పి మండల కేంద్రంలో జరుగుతున్న వర్చ్యువల్‌ మహానాడుకు ముఖ్య అతిథిగా ని యోజకవర్గ పార్టీ పరిశీలకుడు, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 29 , 2026 | 12:17 AM