Share News

TDP: సాయం కాదు... ఆర్థిక భరోసా

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:07 AM

సామాజిక పింఛన్ల పం పిణీని ఏదో సాయంగా కాకుండా బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని, ప్రతి పేదకు ఆర్థిక భరో సా కల్పిస్తోందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్‌ మండలం లోని నాగిరెడ్డిపల్లిలో ఆయన శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TDP:  సాయం కాదు... ఆర్థిక భరోసా
TDP leaders and officers distributing pension in Pamidi

రాయదుర్గం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్ల పం పిణీని ఏదో సాయంగా కాకుండా బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని, ప్రతి పేదకు ఆర్థిక భరో సా కల్పిస్తోందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్‌ మండలం లోని నాగిరెడ్డిపల్లిలో ఆయన శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గం లోనే 36,592 మందికి క్ర మం తప్పకుండా ప్రతి నెల రూ. 16 కోట్లు నేరుగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

పామిడి: కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడుయాదవ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, జిల్లా ప్రఽధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, మండల ఇనచార్జ్‌ గుమ్మనూరు ఈశ్వర్‌ శనివారం పామిడి పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన పంపిణీ చేశారు. మండలంలో 6921 మంది లబ్ధిదారులకు పింఛన అందజేసి 94.58శాతం సాధించినట్లు ఎంపీడీవో తేజోత్స్న తెలిపారు.

- అదేవిధంగా గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి పట్టణాలతో పాటు బెళుగుప్ప, యాడికి తదితర మండలాల్లో శనివారం ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మిగిలిన పింఛన్లను సోమవారం పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారు లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 01 , 2026 | 12:07 AM