Share News

MLA: ఒక్కరోజూ ఆలస్యం లేదు

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:59 PM

రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నా పింఛనుదారులకు డబ్బును అందజేయడంలో ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడంలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సోమవారం ఉదయం చేపట్టిన పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు.

MLA: ఒక్కరోజూ ఆలస్యం లేదు
MLA Jayaram is providing pension to the beneficiary confined to his home

- ఎమ్మెల్యే గుమ్మనూరు

గుంతకల్లు, జూన 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నా పింఛనుదారులకు డబ్బును అందజేయడంలో ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడంలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సోమవారం ఉదయం చేపట్టిన పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్లను అం దించే విషయంలో తాత్సారానికి తావివ్వకుండా అవసరమైతే ఒకటో తేదీ కంటే ఒకటి రెండు రోజుల ముందే లబ్ధిదారులకు డబ్బును చేరు స్తుండటం ప్రజా ప్రభుత్వ సమర్థతకు ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, కేసీ హరి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, ఉడదాల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 01 , 2026 | 11:59 PM