ROAD: సీసీ రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:54 PM
మండలపరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రోడ్లకు నీటితో క్యూరింగ్ సక్రమంగా చేయడం లేదు. దీంతో చేసిన పనులు ఎన్ని రోజులు ఉంటాయో అర్థంకాని పరిస్థితి. మండలకేంద్రమైన కూడేరుతో పాటు కొర్రకోడు, కడదరకుంట గ్రామాల్లో ఓ కాంట్రాక్టర్ దాదాపు రూ, 46.60 లక్షలతో సిమెంట్ రోడ్లు వేశారు. కానీ వాటి క్యూరింగ్ మరిచారు.
- సరిగా క్యూరింగ్ చేయని వైనం
- రోడ్ల మన్నికపై ప్రజల ఆందోళన
కూడేరు, మార్చి31 (ఆంధ్రజ్యోతి) : మండలపరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రోడ్లకు నీటితో క్యూరింగ్ సక్రమంగా చేయడం లేదు. దీంతో చేసిన పనులు ఎన్ని రోజులు ఉంటాయో అర్థంకాని పరిస్థితి. మండలకేంద్రమైన కూడేరుతో పాటు కొర్రకోడు, కడదరకుంట గ్రామాల్లో ఓ కాంట్రాక్టర్ దాదాపు రూ, 46.60 లక్షలతో సిమెంట్ రోడ్లు వేశారు. కానీ వాటి క్యూరింగ్ మరిచారు. నాలుగు రోజులకు ఒక్కసారి క్యూరింగ్ చేస్తే సిమెంట్ రోడ్డు ఎన్ని రోజులు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. పైగా పనులు నాశిరకంగా చేశారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. కూడేరులో రూ. 12 లక్షలు, కడదరకుంటలో రూ. 25 లక్షలు, కొర్రకోడు గ్రామంలో రూ. 9.60 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. అయితే రోడ్డు నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పాటు పనులు పూర్తయిన తర్వాత కూడా అటువైపు కన్నెత్తి చూడలేదన్న వాదనలు వినవస్తున్నాయి. దీం తో కాంట్రాక్టర్ నాలుగురోజులుకు ఒకసారి క్యూరింగ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపనలు వస్తున్నాయి. సీపీరోడ్డు నిర్మాణం అ నంతరం నీటిని నిల్వ చేయడానికి సిమెంట్‌తోగాని, బంకమట్టితోగాని అడ్డుక ట్టలు కట్టి దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు క్యూ రింగ్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఆయా గ్రామాల్లో రోడ్డుపై సాధారణ మట్టి వేయడంతో నీరు నిల్వ ఉండడం లేదు. నీరు పోసిన వెంటనే కిందికి పోతుండటంతో తేమ కూడా ఉండడంలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే పనులు వేసిన మరుసటి రోజునే ఇం జనీరింగ్ అధికారులు బిల్లులు చేసినట్లు తెలుస్తోంది. బిల్లులు చేయడంపై ఉన్న శ్రద్ధ క్యూరింగ్‌పై ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తి చేసిన వెంటనే క్వాలీటీ కంట్రోల్ అధికారులు పరిశీలించకుండానే బిల్లులు చేయడంపైనా అధికారుల బాద్యతను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు స్పందించి మండలంలో జరిగిన సీపీ రోడ్ల నిర్మాణం పనులపై విచారణ చేయాలంటున్నారు.
క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేయిస్తాం - రసూల్. డీఈ పంచాయతీ రాజ్
కూడేరు మండలంలో జరిగిన సీసీ రోడ్ల పనుల నాణ్యతపై క్యాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించి నివేదిక ఇస్తారు. సీసీ రోడ్డు క్యూరింగ్ కాకపోతే కాంట్రాక్టర్‌కు బిల్లుల్లో కోత వేస్తాం. అదేవిధంగా కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి క్యూరింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....