Share News

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:55 PM

కార్మికుల ఖాతాలో వెంటనే మార్చి నెల వేతనాన్నిజమ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని వినాయక కూడలి వద్ద మంగళవారం కార్మికులతో కలిసి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు.

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన
CITU leaders protesting at Vinayaka Koodali

రాయదుర్గం రూరల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మార్చి నెల వేతనాన్ని కార్మికుల ఖాతాలో వెంటనే జమ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని వినాయక కూడలి వద్ద మంగళవారం కార్మికులతో కలిసి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల మంది మున్సిపల్‌ కార్మికులు, ఇతర విభాగాలలో పనిచేసే ఏడువేల మంది కార్మికులకు మార్చి నెలకు సంబంధించిన వేతనం రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేయలేదన్నారు. దీంతో కార్మి కులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారని అన్నారు. కార్మికులకు వచ్చే అరకొర వేతనాన్ని కూడా ప్రతి నెలా సక్రమంగా ఇవ్వకపోతే వారు కుటుంబాలను ఏ విధంగా పోషిం చు కోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం కాలయాపన చేయకుండా మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు చెల్లించవలసిన మార్చి నెల వేతనాన్ని తక్షణమే వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో వేతన సాధన కోసం మరోసారి పోరాటాలకు సంసిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 21 , 2026 | 11:55 PM