Share News

JCPR: మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:14 AM

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రే యింబవళ్లు కష్టపడుతున్నారని ము న్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. వైసీపీ పాలకులు పోలవ రం సహా అన్ని పాజెక్టుల పనులను గాలికి వదిలేశారని, అప్పులు చేసి రాష్ర్టాన్ని నాశనం చేశారని విమర్శించారు.

JCPR: మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి
Chandrababu's royal family is struggling

తాడిపత్రి, ఫిబ్రవరి 21 (ఆంద్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రే యింబవళ్లు కష్టపడుతున్నారని ము న్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. వైసీపీ పాలకులు పోలవ రం సహా అన్ని పాజెక్టుల పనులను గాలికి వదిలేశారని, అప్పులు చేసి రాష్ర్టాన్ని నాశనం చేశారని విమర్శించారు. పట్టణంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత పాలకులు చేసిన అప్పుల ను తీరుస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం కష్టపడుతున్నారని అన్నారు. దావోస్‌ వెళ్లి పెట్టుబడులు తెచ్చారని అన్నారు. డబ్బులు లేకపోయినా అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారని అన్నారు. అదే తరహాలో తామూ అభివృద్ధి చేస్తున్నామని, అది తప్పా అని ప్రశ్నిం చారు. రెండు రోజల క్రితం ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారని అన్నారు. రాయలసీమలో అండర్‌ డ్రైనేజీ కడప, కర్నూలు, చిత్తూరులో ప్రారంభించారని, కానీ పులివెందుల, తాడిపత్రిలో మాత్రమే విజయవంతం అయ్యాయని అన్నారు. మున్సిపాలిటీ బడ్జెట్‌ రూ.143 కోట్లతో ప్రవేశపెట్టామని అ న్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకీ లేని సోలార్‌ ప్రాజెక్టు తాడిప త్రికి రావడం సంతోషకరమని అన్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి కరెంటు బిల్లు రూ.25 లక్షలు ఆదా అవుతుందని అన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 22 , 2026 | 12:14 AM