CPI: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:33 PM
హెచ్చెల్సీ ఆధుని కీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, కాలువల మరమ్మతులకు తక్ష ణం రూ. 430 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు డి జగదీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌తో కలిసి మీ డియాతో మాట్లాడారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ డిమాండ్
కళ్యాణదుర్గం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): హెచ్చెల్సీ ఆధుని కీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, కాలువల మరమ్మతులకు తక్ష ణం రూ. 430 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు డి జగదీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌తో కలిసి మీ డియాతో మాట్లాడారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి ఆంధ్ర ప్రదేశలోని ఆయకట్టుకు సాగునీరు చేరేందుకు హెచ్చెల్సీనే ప్రధాన ఆధారమన్నారు. అయితే కాలువ పొడవునా గండ్లు, రంధ్రాలు, లీకేజీలు పెరిగిపోవడంతో డిసి్ట్రబ్యూటరీలకు నీటి సరఫరా సరిగ్గా లేదన్నారు. దీని ప్రభావంగా చివరి ఆయకట్టుకు నీరు చేరు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనలో 32.5 టీఎంసీల నీటిని వినియోగించాల్సి ఉన్నప్పటికీ కాలువల దుస్థితి కారణంగా ప్రస్తుతం కేవలం 20 టీఎంసీల నీటినే వినియోగిస్తున్నామని అన్నారు. ఈ సమస్యలపై రైతులతో చర్చించి, ఏప్రిల్ 23న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హాజరవుతారని తెలిపారు. ముందుగా గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రైతులను చైతన్య పరుస్తామని వెల్లడిం చారు. కర్ణాటక ప్రభుత్వం కూడా అదేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు నరసింహులు, తిమ్మరాయుడు, బుడేన సాబ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....