CANAL: కలగానే ఆధునికీకరణ
ABN , Publish Date - May 19 , 2026 | 11:39 PM
ఉమ్మడి అనంత పురం జిల్లా ప్రధాన నీటి వనరు అయిన పెన్నహోబిలం బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు హెచ్చెల్సీ నుంచి నీటిని అందించే లింక్ కెనాల్ ఆధునికీకరణ కల గానే మారింది. ఈ కాలువ శిథిలావస్థకు చేరి, అధ్వానంగా తయారైంది. కాలువలో పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు పెరిగిపోయి, నీరు పారడం గగనంగా తయారైంది.
ఉరవకొండ, మే 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంత పురం జిల్లా ప్రధాన నీటి వనరు అయిన పెన్నహోబిలం బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు హెచ్చెల్సీ నుంచి నీటిని అందించే లింక్ కెనాల్ ఆధునికీకరణ కల గానే మారింది. ఈ కాలువ శిథిలావస్థకు చేరి, అధ్వానంగా తయారైంది. కాలువలో పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు పెరిగిపోయి, నీరు పారడం గగనంగా తయారైంది. మండలంలోని మో పిడి వద్ద హెచ్చె ల్సీ నుంచి లింక్ కెనాల్ ప్రారంభమవుతుంది. కాలువ పొడవు 11కి.మీ. ఉంది. కాలువ లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల గట్టు బలహీన పడింది. దీంతో గతంలో కాలువకు గండి పడిన సంద ర్భాలు ఉన్నాయి. అలాంటి చోట్ల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాత్కాలిక మరమ్మతు లు చేపట్టి చేతులు దులుపుకున్నారు. లింక్ కెనాల్ ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని పీఏపీఆర్‌కు తరలించాల్సి ఉంది. కాలువ శిథిలావ స్థకు చేరుకోవడంతో 400క్యూసెక్కులకు మించి నీరు పారడం కష్టంగా ఉంది. ఈ కెనాల్ నుంచి ఉమ్మడి జిల్లాలోని అనం తపురం,
రాయదుర్గంతో పాటు శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుల ద్వారా 900గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. అలాగే కుడికాలువ ద్వారా నాలుగు నియోజకవర్గాల్లోని 42చెరువులకు నీరు అందనుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కాలువ ఆధునికీకరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రతిపాదనలకే సరి
పీఏబీఆర్ లింక్ కెనాల్ ఆధునికీకరణ పనులు ప్రతిపాదనలకే పరిమి తమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ ప్రతిపాదన లతోనే సరిపెట్టారు. రూ.70కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.78కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వంతెనలు, అండర్ టన్నెల్‌లు నిర్మించేలా రూ పొందించారు. ఈ ప్రతిపాదనలు కూడా రెండేళ్ల నుంచి అలాగే ఉండిపో యాయి. నిర్మాణ వ్యయం పెరగడంతో మరలా రూ. 1.05 కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ విషయంపై హెచ్చెల్సీ డీఈ ఉదయ్ శీనయ్యను వివరణ కోరగా నిధులు మంజూరు కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.