Share News

MLA: పట్టణంలో ఎమ్మెల్యే అశ్మితరెడ్డి పర్యటన

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:58 PM

ప్రజా సమస్యలను తె లుసుకుని పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని టైలర్స్‌కాలనీ, శివానగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

MLA: పట్టణంలో ఎమ్మెల్యే అశ్మితరెడ్డి పర్యటన
The MLA is asking the people about their problems

తాడిపత్రి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను తె లుసుకుని పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని టైలర్స్‌కాలనీ, శివానగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ... మీ ఇళ్ల వద్దకే వచ్చానని సమ స్యలు ఏమైనా ఉన్నట్లయితే, వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ సమస్య లను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ తదితర అంశాలపై ఆరాతీశారు. ఆయన వెంట టీడీపీ సీనియర్‌ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, హరినాథ్‌రెడ్డి, పవనకుమార్‌రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు టాటా హాజీ, మాజీ కౌన్సిలర్‌ విజ్జి, మల్లికార్జున రంగనాథరెడ్డి, సుదర్శనరెడ్డి తదితరులు ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 27 , 2026 | 11:58 PM