MLA: కేజీబీవీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే అశ్మితరెడ్డి
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:52 PM
పట్టణంలోని ఆంజనేయ స్వామిమాన్యం సమీపంలో ఉన్న కేజీబీవీ, బాలికల వసతి గృహాలను బుధవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నభోజనం నాణ్యతను పరిశీలించారు. భోజ నం రుచి, నాణ్యత గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
తాడిపత్రి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆంజనేయ స్వామిమాన్యం సమీపంలో ఉన్న కేజీబీవీ, బాలికల వసతి గృహాలను బుధవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నభోజనం నాణ్యతను పరిశీలించారు. భోజ నం రుచి, నాణ్యత గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వంటశాల, స్టోర్‌రూమ్‌లను పరిశీలించారు. తాజా కాయగూరలు వాడా లని, పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. బాలిక ల వసతి గృహంలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంత రం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానం తెలుసుకున్నారు.
ప్రతిభా విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
తాడిపత్రి: భవిష్యత్తులో చాంద్ హఫీజ్ నవాజ్ చేపడుతున్న సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలి పారు. తాడిపత్రిలోని సర్ సీవీ రామన డిగ్రీ కళశాలలలో మూడో సంవత్సరం చదువుతున్న చాంద్ హఫీజ్ జిల్లా సైన్స సెంటర్ వెబ్‌సైట్ ఆండ్రాయిడ్ యాప్ రూపొందించాడు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో బుధవారం తనను కలిసిన ఆ విద్యార్థిని ఎమ్మెల్యే అభినందించారు. బీటెక్ చదువుతూనే స్టార్టప్ ప్రారంభించాలనే ఆ లోచన ఉన్నా, భవిష్యత్తులో గానీ సహకారం అందిస్తానని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....