JCPR: పర్యాటక హబ్‌తో ఆలయాలకు మహర్దశ
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:30 PM
నియోజకవర్గంలోని ఆల యాలకు పర్యాటక పరంగా మహర్దశ పట్టనుందని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పర్యాటక నిపుణుడు, చరిత్రకారుడు మైనాస్వామి, చరిత్ర పరిశోధకుడు పెనుగొండ శ్రీధర్‌తో కలిసి పలు ఆలయాలను సందర్శించారు.
- మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్
తాడిపత్రి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ఆల యాలకు పర్యాటక పరంగా మహర్దశ పట్టనుందని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పర్యాటక నిపుణుడు, చరిత్రకారుడు మైనాస్వామి, చరిత్ర పరిశోధకుడు పెనుగొండ శ్రీధర్‌తో కలిసి పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 250కోట్లతో పర్యాటక అభివృద్ధికి ప్రాథమిక నివేదిక సిద్ధమైందని తెలిపారు. పట్టణంలోని బుగ్గరామలింగేశ్వ ర స్వామి, చింతల వెంకటరమణ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణగా తాడిపత్రి పర్యాటక హబ్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద సౌండ్ అండ్ లైట్‌షో, వెంకటర మణస్వామి ఆలయం సమీపంలో లేజర్‌షో, పురావస్తుశాఖ ప్రదర్శన శాల, ధార్మిక సదస్సు మందిరం, ఆలూరుకోన అభివృద్ధి వంటి కార్యక్ర మాలతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో పర్యాటక హబ్ ఒక గొప్ప పాత్ర పోషించనుందన్నారు. పర్యాటక వలయం ప్రాథమిక నివేదికను వెంకటరమణస్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యాటకహబ్ నివేదికను తయారీలో తనకు అవకాశం కల్పించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డికి మైనాస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రమోహన, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....