GOD: వైభవంగా మహాలక్ష్మి రథోత్సవం
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:24 AM
మండలంలోని తార కాపురం గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి రథోత్సవం మంగ ళవారం సాయంత్రం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవం గా సాగింది. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేసి, అ లంకరించారు.
బొమ్మనహాళ్, జూన 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని తార కాపురం గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి రథోత్సవం మంగ ళవారం సాయంత్రం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవం గా సాగింది. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేసి, అ లంకరించారు. సాయంత్రం మేళాతాళాలు, నందికోళ్లు, గొరువయ్యల నృత్యాలు, వీరభద్ర తదితరు వేషధారుల విన్యాశాల మధ్య అమ్మ వారి ఉత్సవమూర్తిని రథంలో ఊరేగించారు. ఈ సందర్భంగ ఎస్‌ఐ నబీరసూల్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....