Share News

CONGRESS: స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:07 AM

రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంత భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ఈ నెల 17తో ముగిసిందన్నారు.

CONGRESS: స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
Tulsi Reddy speaking in the meeting

- కాంగ్రెస్‌ పార్టీ నేత తులసిరెడ్డి

తాడిపత్రి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంత భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ఈ నెల 17తో ముగిసిందన్నారు. మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోందని తెలిపారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం గడువు ముగియకమునుపే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికి ఆ దిశగా అడుగులు పడలేదన్నారు. జిల్లా పరిషతలు, మండల ప్రజాపరిషతల గడువు సెప్టెంబరుతో ముగస్తుందని తెలిపారు. ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. సమావేశంలో నాయకులు నాగిరెడ్డి, నజీర్‌, నరసింహారెడ్డి, మాబు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 29 , 2026 | 12:07 AM