Share News

AD: వారసత్వ సంపదను కాపాడుకుందాం

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:12 AM

వారసత్వ సంపదను కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందిద్దామని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో రాష్ట్ర పురావస్తు శాఖ, ప్రపంచ వారసత్వ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమం నిర్వహించారు.

AD: వారసత్వ సంపదను కాపాడుకుందాం
Swaminayak conducting a rally with people

- పురావస్తు శాఖ ఏడీ స్వామినాయక్‌

కుందుర్పి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): వారసత్వ సంపదను కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందిద్దామని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో రాష్ట్ర పురావస్తు శాఖ, ప్రపంచ వారసత్వ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పురావస్తు శాఖ ఏడీ స్వామినాయక్‌ హాజరయ్యారు. ఆయన మాట్లా డుతూ... కుందుర్పిలోని పురాతన ఆలయాలు, శిలాశాసనాలు, చారి త్రక కట్టడాలు వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ కా ర్యక్రమంలో పురావస్తు శాఖ ఏడీ మహేంద్ర నాయుడు, ఎంఈవో తిప్పే స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

గుత్తి: స్థానిక గుత్తి కోట సంరక్షణ సమితి, మురారి మహాల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ వారసత్వ దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. కోటలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సమతి అధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌ చౌదరి, పాఠశాల ఉపాధ్యాయుడు సుభాన, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 19 , 2026 | 12:12 AM