COLLECTOR: ప్రతి నీటి చుక్కను ఒడిసిపడదాం : కలెక్టర్
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:04 AM
వర్షాకాలంలో పడిన ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, సద్వినియోగం చేసుకుందామని కలెక్టర్ ఆనం ద్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో భా గంగా ఆయన శనివారం మండలకేంద్రంలో పర్యటించారు.
పెద్దవడుగూరు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో పడిన ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, సద్వినియోగం చేసుకుందామని కలెక్టర్ ఆనం ద్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో భా గంగా ఆయన శనివారం మండలకేంద్రంలో పర్యటించారు. స్థానిక గ్రా మ సచివాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించి అనంతరం పెద్దవాగు సమీపంలో చెక్‌డ్యాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడుతూ ప్రస్తుతం వర్షపునీటిని ఒడిసి పట్టి భూగర్భజలాల పెంపొందించేందుకు రైతులకు, ప్రజలకు అవగాహ న కల్పించాలని తెలిపారు. లేనిపక్షంలో రాబోయే తరం పిల్లలకు నీటికొరత తీవ్రతరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పౌ ష్టిహారాన్ని అంగనవాడీ కేంద్రంలోని పిల్లలకు సక్రమంగా అందించాలని లేనిపక్షంలో వారిని విధుల నుంచి తొలగి స్తామని అంగనవాడీ సి బ్బందిని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరెకటిక కార్పొరేషన చైర్మన హరికృష్ణారావు, తహసీల్దార్ ఉషారాణి, ఎంపీడీవో బారెనసాబ్, అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....