MLA: మహానాడును వైభవంగా నిర్వహిద్దాం
ABN , Publish Date - May 25 , 2026 | 11:44 PM
రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మె ల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు నిచ్చారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.
-ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మె ల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు నిచ్చారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారాలోకేశ పిలుపుమేరకు ఇం ధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఏడాది వర్చ్యువల్ విధానంలో మహా నాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి వద్ద పచ్చటి తోరణాలు కట్టి ఓ పండుగలా జరుపుదామన్నారు. ప్రతి ఒక్కరూ పసుపు దుస్తులు ధరించి పసుపు పండుగను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం లో ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రతి ఇంటా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని, మరోసారి మన ఐక్యతను ఎలుగెత్తి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....