JCPR: ఆలయాన్ని నిర్మిద్దాం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:09 AM
మండలంలోని రాయలచెరువు గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేద్దామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం బాధాకరమన్నారు. శుక్రవారం రాయలచెరువులో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలను ఆయన పరిశీలించారు.
-మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్ -రూ.20లక్షల విరాళం
యాడికి, మార్చి20(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాయలచెరువు గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేద్దామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం బాధాకరమన్నారు. శుక్రవారం రాయలచెరువులో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలను ఆయన పరిశీలించారు. ఆగిపోయిన చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.50లక్షలు వెచ్చించామనీ, ఇంకా కోటి రూపాయలు అవసరం అవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీనిపై జేసీపీఆర్ స్పందిస్తూ.. ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.20లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆలయ నిర్మాణంలో గ్రామస్థులు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. తొందరలోనే రాయలచెరువులో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ నాయకుడు పరిమి చరణ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బేల్దారి శివ, నాయకులు మదమంచి శివ, అమిలినేని శ్రీధర్ ఉన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....