Share News

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:43 PM

క్షయ వ్యాధిని పారద్రోలి క్షయ రహిత దేశంగా చూడాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఆర్డీవో వసంతబాబు పిలుపుని చ్చారు. ప్రపంచ క్షయ వ్యా ధి నిర్మూలన దినం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి టీ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో
RDO and medical personnel conducting the rally

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధిని పారద్రోలి క్షయ రహిత దేశంగా చూడాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఆర్డీవో వసంతబాబు పిలుపుని చ్చారు. ప్రపంచ క్షయ వ్యా ధి నిర్మూలన దినం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి టీ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో మా ట్లాడుతూ అవగాహనతోనే క్షయ వ్యాధిని పూర్తిగా అంతం చేయ వచ్చన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రులు, సీహెచసీల్లోను క్షయకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మున్సిపల్‌ కమి షనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌, డాక్టర్‌ రాజేశ, టీబీ సూపర్‌వైజర్‌ సత్య నారాయణ, శివకుమార్‌, వైద్య సిబ్బంది, రిడ్స్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ మహేశ తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గంరూరల్‌/బొమ్మనహాళ్‌: సమాజంలో క్షయవ్యాధిని అం తం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెడికల్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ మెర్సీ జ్ఞానసుధ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మె డికల్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ మెర్సీ జ్ఞానసుధ , టీబీ యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. టీబీ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ శ్రీకాంతనాయక్‌, హోమియో వైద్యాధికారి డాక్టర్‌ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అ లాగే బొమ్మనహాళ్‌ మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో స్థానిక వైద్యు లు కుమార్‌రాజ, గీతాభార్గవి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నివారణపై అవ గాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో విజయభాస్కర్‌, సీహెచవో రాజశేఖర్‌, హెల్త్‌ హెడ్యూకేటర్‌ రుక్మిణీ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 24 , 2026 | 11:43 PM