Share News

DMHO: సమష్టి కృషితో పోలియోను నిర్మూలిద్దాం

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:41 PM

సమాజంలో అందరి సమిష్టి కృషితో పోలియో మహమ్మారిని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వైద్యశాఖ అధికారులకు సూచిం చారు. జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం పట్టణంలోని శాంతినగర్‌ అర్బన హెల్త్‌ సెంటర్‌ను ఆక స్మి కంగా తనిఖీ చేశారు.

DMHO: సమష్టి కృషితో పోలియోను నిర్మూలిద్దాం
DM&HO inspecting the surroundings of nomadic communities.

- డీఎంహెచవో ఈబీ దేవి

రాయదుర్గం రూరల్‌, జూన 29(ఆంధ్రజ్యోతి): సమాజంలో అందరి సమిష్టి కృషితో పోలియో మహమ్మారిని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వైద్యశాఖ అధికారులకు సూచిం చారు. జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం పట్టణంలోని శాంతినగర్‌ అర్బన హెల్త్‌ సెంటర్‌ను ఆక స్మి కంగా తనిఖీ చేశారు. అనంతరం శాంతినగర్‌లో పర్యటించారు. అక్కడి సంచారజాతులకు చెందిన పిల్లల్లో పోలియో చుక్కలు అందని వారికి అక్కడే వేయించారు. అదే విధంగా మండలంలోని ఆవులదట్ల ప్రాథమి క ఆరోగ్య కేంద్రం పరిధిలో 28 గ్రామాలలో గృహ సందర్శనం చేసి 186 మంది చిన్నారులకు పోలియో చుక్కలను అందించినట్లు తెలిపారు. మండలంలో సున్నా నుంచి ఐదేళ్ల వయస్సున్న పిల్లలు 515 రికార్డుల్లో ఉండగా, సోమవారం కార్యక్రమంతో కలిపి 597 మందికి పోలియోచు క్కలు వేసి 102 శాతం పూర్తి చేసినట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కేం ద్రం వైద్యాధికారి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మాధవమోహనకుమార్‌, ఆరోగ్య విస్తరణాధికారి రామాంజినే యులు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ బి. సుజాత, ఎంఎల్‌హెచపీలు, ఏఎనఎం లు, ఆశా కార్యకర్తలు, అంగనవాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 29 , 2026 | 11:41 PM