Share News

LEAKAGE: మ్యానహోల్‌ వద్ద లీకేజీ

ABN , Publish Date - May 03 , 2026 | 11:21 PM

మండలకేంద్రమైన కంబ దూరు మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి సంబంధించిన మ్యాన హోల్‌ లీకేజీ అవుతోంది. దీంతో మురుగునీరంతా రోడ్డుపై పారుతోంది. రెండేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ సం బంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

LEAKAGE: మ్యానహోల్‌ వద్ద లీకేజీ
Sewage flowing from mana hole at Maremma temple

- రోడ్డుపై పారుతున్న మురుగునీరు

కళ్యాణదుర్గం, మే 3(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రమైన కంబ దూరు మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి సంబంధించిన మ్యాన హోల్‌ లీకేజీ అవుతోంది. దీంతో మురుగునీరంతా రోడ్డుపై పారుతోంది. రెండేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ సం బంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మ్యాన హోల్‌ నుంచి వస్తున్న మురుగునీటీ దుర్వాసనను భరించలేకపోతున్నా మని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు పారే ప్రాంతం ప్రధాన రహదారి కావడమేగాకుండా పక్కనే మారెమ్మ దేవాలయం ఉంది. దీంతో అక్కడకు వచ్చే భక్తులు దుర్వాసన భరించలేక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ మ్యానహోల్‌కు మరమ్మతులు చేయాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 03 , 2026 | 11:21 PM