WASTE: రూ. లక్షలు వృథా
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:16 PM
మండలంలోని గాండ్లపాడు గ్రామంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్తతో సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. చెత్త సంపద తయారీ కేంద్రం ఉ న్నా చెత్తాచెదారాన్ని గ్రామస్థులు ఆరు బయట గ్రామ సమీపంలోనే వేస్తున్నారు.
పుట్లూరు, జూన 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని గాండ్లపాడు గ్రామంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్తతో సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. చెత్త సంపద తయారీ కేంద్రం ఉ న్నా చెత్తాచెదారాన్ని గ్రామస్థులు ఆరు బయట గ్రామ సమీపంలోనే వేస్తున్నారు. సుమారు రూ.6లక్షలు పెట్టి ఈ కేంద్రాన్ని నిర్మిస్తే అధి కారులు కనీసం దానివైపు చూసిన పాపానపోలేదు. ఆ గ్రామంలోని చెత్తాచెదారాన్నంతా గ్రామస్థులు గ్రామ సమీపంలోని వంకలో వేస్తున్నా రు. వర్షం వచ్చినప్పుడు వంక పారినప్పుడు ఆ చెత్తాచెదారం అంతా నీళ్లలో కొట్టుకుపోతోంది. పైగా ఇలా ఏళ్లతరబడి వంకలోనే చెత్త వేస్తుం డడంతో అది పేరుకుపోయి, పెద్ద వర్షాలు వచ్చినప్పుడు పొలాల్లోకి నీరు వెళుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా దిష్టిబొమ్మలా
ఉపాధిహామీ పథకం కింద 2018ఏడాదిలో గాండ్లపాడు గ్రామ శివారులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. గ్రామం లోని చెత్తా చెదారాన్ని అక్కడికి తరలించి, సేంద్రియ ఎరువులను తయారుచేయాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. దీంతో రైతులు రసాయన ఎరువులను వాడకుండా అందులో తయారయ్యే బయో ఎరువులను వాడుకొనే అవకాశం ఉంటుంది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎనిమిదేళ్లుగా దిష్టిబొమ్మలా మారింది. ప్రస్తుతం అందులో మందుబాబులు హల్‌చల్ చేస్తున్నారు. వర్షం వస్తే చాలు అందులో కూర్చొని మద్యం తాగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాగా చెత్తసంపద కేంద్రం ఊరికి దూరంగా ఉండడంతోనే వాడకంలోకి రాలేదని గ్రామస్థులు చెబుతుండడం గమనార్హం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....