Share News

FODDER: పశువులకు మేత కొరత

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:35 PM

పశువుల మేత కోసం ని యోజకవర్గంలోని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎక్క డా పశువుల మేత దొరకకపోవడంతో కర్ణాటక ప్రాంత నుంచి పశుగ్రా సాన్ని తెప్పించుకుని పశువుల ఆకలి తీరుస్తున్నారు.

FODDER: పశువులకు మేత కొరత
A view of a tractor moving corn husks in a tractor

- ఇబ్బందులు పడుతున్న యజమానులు

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): పశువుల మేత కోసం ని యోజకవర్గంలోని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎక్క డా పశువుల మేత దొరకకపోవడంతో కర్ణాటక ప్రాంత నుంచి పశుగ్రా సాన్ని తెప్పించుకుని పశువుల ఆకలి తీరుస్తున్నారు. ఖరీఫ్‌ ప్రా రంభం లోనే ఇలాఉంటే మూగ జీవాలను ఎలా కాపాడు కోవాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పశుగ్రాసం కొరత ఏర్పడ డం తో, ఇక్కడి రైతులు మొక్కజొన్న సొప్పను బొమ్మనహాల్‌, కణేకల్‌ మండ లాల నుంచి, కర్ణాటక ప్రాంతం నుం ట్రాక్టర్లలో తెప్పించుకుంటున్నారు. ట్రాక్టర్‌ సొప్ప ధర రూ. 6,500 నుంచి రూ.7,500 వరకు పలుకుతోంది. స్థానికంగా మేత కరువవడంతో పశుగ్రాసాన్ని కొనుక్కోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఉచితంగా పశుగ్రా సాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 09 , 2026 | 11:35 PM