BUS STAND: బస్టాండ్‌లో వసతులు కరువు
ABN , Publish Date - May 25 , 2026 | 11:32 PM
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీ స వసతులు కరువై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాగడానికి సరిపడా నీరు లేదు. అదే విధంగా చాలీ చాలనీ కూర్చీలతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చోరీలతో బస్టాండ్ కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
- పెరుగుతున్న చోరీలు - ప్రజల్లో ఆందోళన
గుత్తి, మే 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీ స వసతులు కరువై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాగడానికి సరిపడా నీరు లేదు. అదే విధంగా చాలీ చాలనీ కూర్చీలతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చోరీలతో బస్టాండ్ కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నూతన బస్టాండ్ నిర్మాణం జాప్యం అవుతుండటంతో ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌లో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన దుకాణాలలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐఎస్‌ఐ మార్క్ గల బాటిళ్లను విక్రయించాల్సి ఉండగా లోకల్‌గా తయారు అవుతున్న వాటర్ బాటిళ్లను అంటకడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెచ్చిపోతున్న దొంగలు
వేసవి సెలువులు ఉండటంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిం ది. ఇదే అదునుగా బస్టాండ్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇక్కడ ని త్యం ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉంది. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రయా ణికుల బ్యాగుల లోని నగదు, ఆభరణాలు, సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. బ్యాగు లు చూ సుకున్న తరువాత ప్రయాణికులు లబోదిబో అంటున్నారు.
చోరీల నియంత్రణకు బస్టాండ్‌లో పోలీసులు ఉన్నప్పటికీ, చోరీలు మాత్రం జరుగుతూనే ఉన్నాయని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొన్ని మాత్రమే పని చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యం కల్పించా లని, చోరీలను అరికట్టాలని, నూతన బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయంపై గుంతకల్లు డిపో మేనేజర్ ఖాజా వలిని వివరణ కోరగా బస్టాండ్‌లో కొళాయిల మరమ్మతులు చేసి నీరు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం కుండలలో తాగునీటిని ఏర్పాటు చేశామన్నారు. చోరీలు జరగకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.