Share News

COLONY: కసీస సౌకర్యాలు కరువు

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:39 PM

అధికారులు ఓ వైపు స్వచ్ఛత కార్యక్రమాల పేరుతో ఊదరగొడుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తున్నా రు తప్ప సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీసీ కాలనీ లో సమస్యలు తిష్ట వేశాయి. దాదాపు రెండు వేల నివాస గృహాలు ఉన్న ప్పటికి కాలనీలో మౌలిక వసతులు కరువయ్యాయి.

COLONY: కసీస సౌకర్యాలు కరువు
Sewage water flowing on the road in the BC Colony.

- ఇబ్బందులు పడుతున్న బీసీ కాలనీ వాసులు

గుత్తి, జూన 23 (ఆంధ్రజ్యోతి): అధికారులు ఓ వైపు స్వచ్ఛత కార్యక్రమాల పేరుతో ఊదరగొడుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తున్నా రు తప్ప సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీసీ కాలనీ లో సమస్యలు తిష్ట వేశాయి. దాదాపు రెండు వేల నివాస గృహాలు ఉన్న ప్పటికి కాలనీలో మౌలిక వసతులు కరువయ్యాయి. కాలనీకి ప్రధాన రహదారిని నిర్మించకపోవడంతో అది ఆక్రమణలకు గురవుతోంది. కొన్ని చోట్ల రోడ్లు వేసినప్పటికి డ్రైనేజీ కాలువ నిర్మించలేదు.


ప్రస్తు తం ఉన్న మట్టి కాలువలో చెత్తచెదారం పేరుకుపోయి మురుగు నీరు ఎక్కడికక్కడ నిలచిపోయింది. దాని నుంచి దుర్వాసనతో పాటు దోమ ల బెడద ఎక్కువైందని, దీంతో తాము రోగాల బారిన పడుతున్నా మని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారానికి ఒక్కసారి కూడా కాలనీలో రోడ్లు ఊడ్చకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయిందని మండి పడుతున్నారు. కాలనీలో 15 రోజులకొకసారైనా కొళాయి ద్వారా నీర సరఫరా కావడం గగనం అం టున్నారు. ప్రస్తుతం కాలనీలో ఉన్న స్పాట్‌ డెలవరి ట్యాంక్‌ రెండు నెలలుగా మరమ్మతులకు నోచుకుపోవడంతో నిరుపయోగంగా మా రింది. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించునే నాథుడే లేడని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాలనీలో పలు చోట్ల వీధి దీపాలు లేక చీకట్లో మగ్గుతున్నారు. ప్రజల నుంచి ఆదాయం వస్తున్నప్పటికి కాలనీ మాత్రం అభివృద్దికి నోచుకోవడం లేదని వారు వాపోతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 23 , 2026 | 11:39 PM