IFTU: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:42 PM
కేంద్ర ప్రభు త్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వా రు మంగళవారం స్ధానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
- ఐఎఫ్‌టీయూ నాయకుల డిమాండ్
గుంతకల్లు టౌన, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభు త్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వా రు మంగళవారం స్ధానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎ్‌ఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బీ సురేష్ మాట్లాడుతూ... జీతాలు పెంచాలని ఉత్తర ప్రదేశ రాష్ట్రంలోని నోయిడా పారిశ్రామికవాడలో కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. వా రి నిరసన కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పోలీసుల ద్వారా అణిచివేయాలని ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నోయిడా కార్మికుల మీద అక్ర మంగా బనాయించిన క్రిమినల్ కేసులను తొలగించాలన్నారు. లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కార్మికు లు నిరసన తెలుపుతున్నారని అన్నారు. 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్ర మంలో ఐఎఫ్‌టీయూ నాయకులు రామదాస్, జిలాన, సత్తార్, వినోద్, సాయి, షేక్షావలి, బాష, రామాంజి, గోపి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....