Share News

GOD కమనీయం సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:16 AM

పట్టణంలోని ఏటిగడ్డపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కల్యాణ వేడుకలు ఆలయాన్ని అధ్యాత్మిక వాతావరణం తో నింపాయి.

GOD కమనీయం సీతారాముల కల్యాణం
Priests performing the welfare of Sitaram

తాడిపత్రి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఏటిగడ్డపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కల్యాణ వేడుకలు ఆలయాన్ని అధ్యాత్మిక వాతావరణం తో నింపాయి. సీతా సమేత శ్రీరామచంద్రుడి ఉత్సవ విగ్రహాలను ప ట్టువసా్త్రలు, స్వర్ణాభరణాలతో అద్భుతంగా అలంకరించారు. వేద మం త్రోచ్ఛారణ మధ్య ఆలయ అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించా రు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. అ నంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాద వినియోగం, అన్నదా నం ఏర్పాటుచేశారు. సాయంత్రం సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాల ను పట్టణంలో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రోషన్న, రామకృష్ణ, శ్రీనివాసనాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 05 , 2026 | 12:16 AM