JC: ఐఓసీ డిపోను తనిఖీ చేసిన జేసీ
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:55 PM
మండలంలోని న క్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న ఇండియన ఆయిల్ కంపెనీ (ఐఓసీ)డిపోను మంగళవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తని ఖీ చేశారు. ఐఓసీ డిపోలో వచ్చిన డీజిల్, పెట్రోల్ స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రిటైల్ ఔట్‌లెట్‌లకు సకాలంలో డీజిల్, పె ట్రోల్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
గుంతకల్లుటౌన, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని న క్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న ఇండియన ఆయిల్ కంపెనీ (ఐఓసీ)డిపోను మంగళవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తని ఖీ చేశారు. ఐఓసీ డిపోలో వచ్చిన డీజిల్, పెట్రోల్ స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రిటైల్ ఔట్‌లెట్‌లకు సకాలంలో డీజిల్, పె ట్రోల్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పెట్రోల్, డీజిల్ కొ రత వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ రమాదేవి, సీఎస్‌డీటీ సుబ్బలక్ష్మి, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
గుత్తి: పట్టణంలోని కర్నూలు రోడ్డులో ఉన్నభారత పెట్రోల్ కెమి కల్ లిమిటెడ్ (బీపీసీఎల్) కేంద్నాన్ని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మంగళవారం తనిఖీ చేశారు. ప్రజా సౌకర్యార్థం బీపీసీఎల్ ప్లాం ట్‌ను 24 గంటలు నిరంతరం నిర్వహించాలన్నారు. డిపోలో స్టాక్ వివరాలను పరిశీలించారు. ఫిల్లింగ్ డిపోను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ సూర్యనారాయణ, బీపీసీఎల్ డిపో మేనేజర్ జయరామన, ఆర్‌ఐ హనుమానప్రసాద్, వీఆర్వో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....