Share News

JC: ఎంఐజీ లేఅవుట్‌ను పరిశీలించిన జేసీ

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:47 PM

పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్‌ను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ పరిశీలించారు. సర్వే నెంబరు 642లో 11.82 ఎకరాల విస్తీర్ణంలో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. దానిని పరిశీలించిన జేసీ మాట్లాడుతూ... లేఅవుట్‌లో పిచ్చిమొక్కలు తొలగించాలని సూచిం చారు.

JC: ఎంఐజీ లేఅవుట్‌ను పరిశీలించిన జేసీ
JC Vishnucharan talking to officials at MIG Layout

గుత్తి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్‌ను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ పరిశీలించారు. సర్వే నెంబరు 642లో 11.82 ఎకరాల విస్తీర్ణంలో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. దానిని పరిశీలించిన జేసీ మాట్లాడుతూ... లేఅవుట్‌లో పిచ్చిమొక్కలు తొలగించాలని సూచిం చారు. అనంతరం పట్టణంలోని మండల పరిషత కార్యాలయం వెనుక భాగంలో ఖాళీగా ఉన్న 50 సెంట్ల స్థలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పా టుకు స్థలాన్ని పరిశీలించారు. అహుడా జిల్లా అధికారి రామకృష్ణా రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బర్‌మీయా, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డి, గుంతకల్లు సహాయ అధికారి అశ్వత్థ, సర్వేయర్‌ మారెప్ప, వీఆర్వో సురేంద్ర, పట్టణ ప్రణాళిక అధికారి పప్పుస్వామి పాల్గొన్నారు.

చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలి : జడ్పీ సీఈవో

వజ్రకరూరు(ఉరవకొండ): ఇంటిం టా చెత్త సేకరణను పక్కాగా చేపట్టాలని జడ్పీ సీఈవో శివశంకర్‌ సూచించారు. ఆయన బుధవారం వజ్రకరూరు మేజరు పంచాయతీలో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతం చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయా న్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివాజీ రెడ్డి, ఈవో ఆర్డీ దామోదర్‌ రెడ్డి, సర్పంచ మోనాలిసా పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 25 , 2026 | 11:47 PM