JSP: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:38 PM
గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీబలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ సీనియర్ నా యకుడు పూల రమణ పేర్కొన్నారు. స్ధానిక కసాపురం రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుంతకల్లుటౌన, మార్చి1 (ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీబలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ సీనియర్ నా యకుడు పూల రమణ పేర్కొన్నారు. స్ధానిక కసాపురం రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు గోవిందరాజులు, అరికెరి జీవన, బీ గోపి, పవన, న్యాయవాది పీజీఎస్ బాబు, బాలాజీ, వీరేష్, శ్రీనివాసులు, విజయజ్యోతి, వాణి, రోజా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది, టీడీపీ నాయకుడు పీజీఎస్ బాబు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సీనియర్ నాయకు లు పూల రమణ సమక్షంలో ఆయన పార్టీ కండువా వేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ వ్యక్తిత్వం, ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను చూసి ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరుతున్నానని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....