MLA: బీటీపీ కాలువ పనులు ఆపింది జగనరెడ్డే
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:21 AM
బీటీ ప్రాజెక్టు కాలువ పనులు ఆపింది జగనరెడ్డేనని, ఆ విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకో వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలో ని ప్రజావేదిక వద్ద మంగళవారం రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దేశంలో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన కళ్యాణ్ విజయోత్సవా లను ఘనంగా నిర్వహించారు.
- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం, జూన 16(ఆంధ్రజ్యోతి): బీటీ ప్రాజెక్టు కాలువ పనులు ఆపింది జగనరెడ్డేనని, ఆ విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకో వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలో ని ప్రజావేదిక వద్ద మంగళవారం రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దేశంలో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన కళ్యాణ్ విజయోత్సవా లను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీటీ ప్రాజెక్టు కాలువ పనులను ప్రారంభించి రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. అయి తే వైసీపీ హ యాంలో ఐదేళ్ల పాటు అక్రమాలమయంగా సాగిందే కానీ, అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ర్టాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తు న్నామన్నారు. ఈ రోజు ఏ గ్రామంలో చూసినా కూటమి ప్రభుత్వా నికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి, వైసీపీ నేతలు జీర్ణించుకోలేక కూటమి నేతలపై దూషణలకు పాల్పడుతున్నారన్నారు.
కూటమి ప్రభుత్వానికి ప్రజల అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఇక తిరుగు ఉండదని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లను పంచిపెట్టారు. కార్యక్రమం లో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పిల్లల క్షేమం విస్మరించిన వైసీపీ ప్రభుత్వం
కళ్యాణదుర్గం రూరల్: గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్షేమం విస్మరించిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. పట్టణంళక్షణళక్షణలోలోని ప్రజావేదికలో మంగళవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, బుద్ధిమాంద్య పిల్లలకు కిట్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారికి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సీపీ చైర్లు 12, మూడు చక్రాల సైకిళ్లు తొమ్మిది, వీల్ చైర్లు 20, టీఎల్ ఎం కిట్లు 52, బ్రెయిలీ కిట్లు మూడు, శ్రవణ పరికరాలు 12 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ శైలజ, నాలుగు మండలాల ఎంఈవోలు, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....